Investment: ఈ ఇన్‌వెస్ట్‌మెంట్స్ గురించి తెలుసా?
Hyderabad: భవిష్యత్తు కోసం ఇప్పటినుంచి ఇన్‌వెస్ట్‌మెంట్స్ (investment)చేస్తుంటాం. కానీ ఇన్‌వెస్ట్‌మెంట్ అంటే కేవలం ఆస్తులు, డబ్బులను కూడబెట్టుకోవడమే కాదు. అంతకుమించిన విలువైన ఇన్‌వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. అవేంటంటే..
మీపై మీరు ఇన్‌వెస్ట్ చేసుకోండి
అంటే మీ ఆరోగ్యంపై, మీరు ఆలోచించే విధానంపై ఇన్‌వెస్ట్ చేసుకుని చూడండి. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏమైనా చేయగలం. కాబట్టి మీరు తింటున్న ఫుడ్, వాడే ప్రొడక్ట్స్‌పై ఇన్‌వెస్ట్ చేయండి. అంటే తినే తిండి కాస్త ఖరీదైనా ఫర్వాలేదు ఆరోగ్యాన్ని ఇచ్చేవి మాత్రమే తినండి.
అనుభవంపై ఇన్‌వెస్ట్
అనుభవాలపై ఇన్‌వెస్ట్ చేస్తే మంచి చెడు ఏంటి అనేది తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరేంటో మీకే తెలుస్తుంది. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన ఇన్‌వెస్ట్‌మెంట్.
నాలెడ్జ్‌పై ఇన్‌వెస్ట్
అంటే నాలెడ్జ్ పెంచుకోవడంపై ఇన్‌వెస్ట్ చేసి చూడండి. బుక్స్ చదువుకోవడం, కోర్సులు నేర్చుకోవడంపై ఇన్‌వెస్ట్ చేయండి. వాటిని నేర్చుకున్నప్పుడు కలిగే అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఇవన్నీ ఇన్‌వెస్ట్‌మెంట్స్ (investments) కిందికే వస్తాయి. మీరు ఆస్తులు కూడబెట్టుకునే ఇన్‌వెస్ట్‌మెంట్స్ చేస్తే అవి ఎప్పుడు ఉంటాయో పోతాయో తెలీదు. కానీ పైన చెప్పిన వాటిపై ఇన్‌వెస్ట్ చేస్తే మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాయి.