Tamanna: అందుకే హైద‌రాబాద్‌లో ఇల్లు కొనుక్కోలేదు

Hyderabad: తెలుగులో ఎన్నో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (tamanna). ఇక్క‌డ ఇంత పాపులారిటీ తెచ్చుకున్న‌ప్ప‌టికీ హైద‌రాబాద్‌లో ఇల్లు మాత్రం కొనుక్కోలేదు. కానీ ముంబైలో మాత్రం ఖ‌రీదైన ఫ్లాట్ తీసుకుంది. అయితే హైద‌రాబాద్‌లో ఇల్లు కొనుక్కోక‌పోవ‌డానికి కార‌ణం వెల్ల‌డించింది త‌మ‌న్నా. త‌న తల్లిదండ్రులు ముంబైలోనే ఉంటార‌ట‌. అందుకే అక్క‌డే ఓ ఫ్లాట్ తీసుకున్నాన‌ని తెలిపింది. అయితే ఇక్క‌డ ఇల్లు కొనుక్కోక‌పోవ‌డానికి కార‌ణం.. రాత్రిళ్లు ఒంట‌రిగా ఉంటే ఒక‌వేళ ఆక‌లి వేస్తే వండిపెట్టేవారు ఎవ‌రూ ఉండ‌ర‌ని, అదీకాకుండా లాండ్రీ లాంటివి చేసుకోవ‌డం క‌ష్టం అవుతుంద‌ని తెలిపింది. పైగా హోట‌ల్ రూమ్స్‌లోనే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పింది.

ఇక తెలుగులో భోళా శంక‌ర్ (bhola shankar) సినిమాతో త్వ‌రలో ఆడియ‌న్స్ ముందుకు రాబోతోంది త‌మ‌న్నా (tamanna). ఇప్పుడు త‌న చేతిలో తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. కానీ ఆమె న‌టించిన ల‌స్ట్ స్టోరీస్ 2 (lust stories 2) చూసి ఫ్యాన్స్ మాత్రం చాలా హ‌ర్ట్ అయ్యారు. అస‌లు నో లిప్ కిస్ సీన్ అన్న రూల్ పెట్టుకున్న త‌మ‌న్నా ల‌స్ట్ స్టోరీస్ కోసం అన్నీ బ్రేక్ చేసి ఏకంగా శృంగార సీన్స్‌లో న‌టించ‌డమేంటి అని కామెంట్స్ పెడుతున్నారు. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్న జైల‌ర్ (jailer) సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది.