Bandi Sanjay కోసం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Khammam: కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్‌ను (bandi sanjay) BJP అధ్యక్ష పదవి నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. దాంతో మ‌న‌స్తాపం చెంది ఖమ్మం BJP వైస్ ప్రెసిడెంట్ గజ్జల శ్రీనివాస్ (gajjela srinivas) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోవాల‌నుకున్నాడు. అది చూసిన కుటుంబీకులు వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. శ్రీనివాస్ ద‌గ్గ‌ర ఓ లెట‌ర్ కూడా దొరికింది. అందులో బండి సంజ‌య్ అన్న‌ని అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించడం బాధాక‌ర‌మ‌ని అది త‌ట్టుకోలేకే చ‌నిపోవాల‌ని అనుకున్నాన‌ని రాసుంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.