Viral News: మేక‌ను బ‌లిచ్చాడు..దానికే బ‌ల‌య్యాడు!

Chattisgarh: ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో వైర‌ల్ ఘ‌ట‌న చోటుచేసుకుంది (viral news). ఓ వ్య‌క్తి మేక‌ను బ‌లిచ్చి చివ‌రికి దానికే బ‌ల‌య్యాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. సూర‌జ్‌పూర్ జిల్లాకు చెందిన బ‌గ‌ర్ సాయి అనే 50 ఏళ్ల వృద్ధుడు త‌న కోరిక‌ నెర‌వేర‌డంతో అమ్మ‌వారికి మేక‌ను (sacrificed goat) బ‌లిచ్చాడు. ఆ త‌ర్వాత దానిని వండి ప‌ది మందినీ భోజ‌నానికి పిలిచాడు. అయితే భోజ‌నం వ‌డ్డిస్తున్న‌ స‌మ‌యంలో మేక క‌న్ను ముక్క సాయికి వ‌చ్చింది. దానిని కొరికి తింటుండ‌గా అది గొంతులో ఇరుక్కుంది. దాంతో ఊపిరి ఆడ‌క అత‌ను అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. దాంతో అంతా మేక‌ను బ‌లి ఇచ్చినందుకే ఇలా జ‌రిగింది అంటూ భోజ‌నాలు మానేసి ఎవ‌రి ఇళ్ల‌కు వారు వెళ్లిపోయారు.