Rani Rudrama: బండి సంజ‌య్‌ని ప్ర‌ధానిని చేస్తార‌ట‌

Hyderabad: కరీంన‌గ‌ర్ BJP ఎంపీ బండి సంజ‌య్‌ను (bandi sanjay) ప్ర‌ధానిని చేస్తారేమో అంటూ హాట్ కామెంట్స్ చేసారు BJP నేత రాణి రుద్ర‌మ‌ (rani rudrama). కొంత‌కాలంగా BJP తెలంగాణకు చెందిన ప‌ద‌వుల్లో మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు వాద‌న‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే BJP తెలంగాణ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను తొల‌గించి ఆ ప‌ద‌విని మంత్రి కిష‌న్ రెడ్డికి (kishan reddy) ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక బండి సంజ‌య్‌కు (bandi sanjay) కేంద్ర స‌హాయ మంత్రిగా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రేంజ్‌లో బండి సంజ‌య్‌కు హైప్ ఇస్తున్నారంటే ముందు ముందు ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా నిల‌బెట్ట‌డానికేమో అని రాణి రుద్ర‌మ (rani rudrama) అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.