Shobana Kamineni: క్లీంకారా ఉపాస‌న‌కు పెట్టాల‌నుకున్నా

Hyderabad: రామ్ చ‌ర‌ణ్ (ram charan), ఉపాస‌నల (upasana) గారాల‌ప‌ట్టికి క్లీంకారా (klin kaara) అని సంప్ర‌దాయ‌మైన పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. పేరు పెట్టిన‌ప్ప‌టి నుంచి క్లీంకారా కొణిదెల పేరు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోతోంది. ఈ పేరును చిరంజీవి (chiranjeevi), సురేఖ (surekha) దంప‌తులు, శోభ‌న (shobana kamineni), అనిల్ కామినేని దంప‌తులు క‌లిసే నిర్ణ‌యించారట‌. క్లీంకారా అనే పేరును ముందు స‌జెస్ట్ చేసింది శోభ‌న కామినేని. ఈ విష‌యాన్ని ఆమే వెల్ల‌డించారు. ఉపాస‌న పుట్టిన‌ప్పుడు క్లీంకారా  (klin kaara konidela) అని పెట్టాల‌నుకున్నార‌ట‌. అప్ప‌ట్లో కుద‌ర‌క‌పోయినా ఇప్పుడు మ‌న‌వ‌రాలికి ఆ పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంద‌ని శోభ‌న తెలిపారు.