Balakrishna: సెప్పిందండి సిత్రాంగి శ్రీరంగ‌నీతులు..!

Hyderabad: విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు (jagapathi babu) మెయిల్ రోల్‌లో యాక్ట్ చేసిన సినిమా రుద్రాంగి (rudrangi). విమ‌లా రామ‌న్ (vimala raman) జ‌గ‌ప‌తి బాబుకి భార్య క్యారెక్ట‌ర్‌లో న‌టించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్‌గా జ‌రిగింది. ఈవెంట్‌కి జ‌గ‌ప‌తిబాబుకి ఎంతో ఆప్తుడైన నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ (balakrishna) చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా స్టేజ్‌పై రుద్రాంగి సినిమాలో ఉన్న డైలాగ్‌ను బాల‌య్య చెప్ప‌డం హైలైట్‌గా నిలిచింది. సెప్పిందండి సిత్రాంగి శ్రీరంగ నీతులు అంటూ బాల‌య్య డైలాగ్ చెప్ప‌గానే ఫ్యాన్స్ కేక‌లు వేసారు. బాల‌య్య‌ ఈ డైలాగ్ చెప్తున్న వీడియోను జ‌గ‌ప‌తి బాబు ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ అనుబంధం వ‌ల్లే క‌ష్ట‌మైనా ఇష్టంతో వ‌చ్చి మా రుద్రాంగి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బ్లెస్సింగ్స్ ఇచ్చారు బాల‌య్య బాబు అని ట్వీట్ చేసారు.