Dhanush: శ్రీవారి సేవ‌లో ధ‌నుష్‌

Tirumala: కోలీవుడ్ న‌టుడు ధ‌నుష్ (dhanush) శ్రీవారి సేవ‌లో ఉన్నారు. త‌న ఇద్ద‌రు కుమారులు యాత్ర‌, లింగాల‌తో క‌లిసి తిరుమ‌ల వెళ్లారు. ద‌ర్శ‌నం త‌ర్వాత ముగ్గురూ గుండు చేయించుకున్నారు. వీరి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్ (captain miller) అనే సినిమాలో న‌టిస్తున్నారు. అయితే ధ‌నుష్ (dhanush) మొక్కు కోసం గుండు చేయించుకోలేద‌ని త‌న 50వ సినిమా లుక్ కోసం చేయించుకున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.