Male Fertility Tips: మగవాళ్లు తప్పకుండా తెలుసుకోవాలి
Hyderabad: పిల్లల్ని కనలేకపోవడం (male fertility tips) అనేది ఆడవారికే కాదు మగవారికి కూడా డిప్రెషన్ కలిగించే అంశం అనే చెప్పాలి. ప్రతి ఆరు దంపతుల్లో ఒక జంటకి పిల్లలు కలగడం లేదని ఓ నివేదికలో తేలింది. సమయానికి శరీరంలో జరిగే మార్పులను, సరైన లైఫ్‌స్టైల్‌ను పాటిస్తే సంతానలేమి సమస్యలను దూరం చేయొచ్చు. ముఖ్యంగా ఈ టిప్స్ మగవారు తప్పకుండా తెలుసుకోవాలని అంటున్నారు వైద్య నిపుణులు. ఓ మహిళ గర్భంలోని అండాశయాన్ని చేరుకునే వీర్య కణాలు చాలా ఆరోగ్యంగా ఉండాలట. అంటే స్పెర్మ్ క్వాలిటీ (sperm quality) బాగుంటేనే ఎలాంటి సమస్యలు లేకుండా పిల్లలు కలుగుతారని అంటున్నారు. అయితే గత 40 ఏళ్లలో పోలిస్తే ఈ స్పెర్మ్ క్వాలిటీ అనేది 50 నుంచి 60% పడిపోయిందట. ఇందుకు కారణం మగవారు తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడమే. కాబట్టి ముఖ్యంగా మగవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో చూసుకోండి. దాని వల్ల మీ శరరీంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించండి. ఎక్కువ తినేస్తున్నాం అన్నది సమస్య కాదు. ఆ తిన్నదానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. ఏ వయసులో పిల్లల్ని కంటున్నారు అనేది కూడా చూసుకోండి. మరీ 35, 40 ఏళ్లు వచ్చే వరకు పిల్లల్ని వద్దు అనుకోకండి. ఆ తర్వాత కనాలనుకున్నా కలగకపోవచ్చు. ఒకవేళ మగవారిలో క్యాన్సర్ వంటి వ్యాధి ఉండి పిల్లల్ని కనాలని అనుకునేవారు కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు మొదలుపెట్టడానికి ముందే మీ స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేయించుకోండి. లేకపోతే మీలో ఎంత క్వాలిటీ స్పెర్మ్ ప్రొడ్యూస్ అయినా కూడా కీమో, రేడియేషన్ వల్ల ఆ క్వాలిటీ పడిపోతుంది.