Pawan Kalyan ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ..?

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీ ఎకౌంట్స్ లేవు. ఆయ‌న పొలిటిక‌ల్ క్యాంపెయిన్స్ కోసం జ‌న‌సేన (janasena) పేరుతో ట్విట‌ర్‌లో అఫీషియ‌ల్ ఎకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా కూడా ఖాతా తెర‌వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇది సెల‌బ్రిటీ అకౌంటా లేదా ట్విట‌ర్ లాగే జ‌న‌సేన కోస‌మా అనేది ఖాతా తెరిచాకే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ప‌వ‌న్ ఇన్‌స్టాలోకి వ‌స్తారా అని ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.