Dulquer Salmaan: ఏడుస్తూ పోస్ట్ పెట్టిన‌ హీరో..ఏం జ‌రిగింది?

Hyderabad: ప్ర‌ముఖ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ (dulquer salmaan) ఏడుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. కాసేప‌టికే దానిని డిలీట్ చేసాడు. ఆ వీడియోలో కొంత‌కాలంగా స‌రిగ్గా నిద్ర‌పోలేక‌పోతున్నా. మొద‌టిసారి నా జీవితంలో ఒక‌టి ఎదురైంది. అప్ప‌టి నుంచి నేను నేనుగా లేను. ఇప్పుడు నేను దానిని మ‌ర్చిపోలేక‌పోతున్నాను. నాకు చాలా చెప్పాల‌ని ఉంది కానీ చెప్పే అనుమ‌తి నాకు ఉందో లేదో తెలీదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ లేదు. దాంతో ఫ్యాన్స్ ఏం జ‌రిగింది అంటూ వ‌ర్రీ అవుతున్నారు. ఓ నెటిజ‌న్ డిలీట్ చేసిన వీడియోని ముందే సేవ్ చేసుకున్నాడు. ఆ వీడియోని అత‌నే పోస్ట్ చేసి దుల్క‌ర్ (dulquer salmaan) ఇలా ఏడుస్తూ పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసాడు ఏం జ‌రిగిందో ఏమో అంటూ కామెంట్ పెట్టాడు. క‌నీసం ఫ్యాన్స్ కోస‌మైనా దుల్క‌ర్ దీనిపై ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక సినిమాల విష‌యానికొస్తే ఆయ‌న న‌టించిన కింగ్ ఆఫ్ కోటా (king of kotha) సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవ‌బోతోంది.