Sharad Pawar: ఎన్నికలకు ముందు షాక్.. నాకు అసలు తెలీదు
Delhi: నేషనల్ కాంగ్రెస్ పార్టీకి (NCP) ఎన్నికలకు ముందు షాకిచ్చారు అజిత్ పవార్ (ajit pawar). అసలు ఏం జరిగిందో ఏమో కానీ.. ఉన్నట్టుండి నిన్న రాత్రి ఎమ్మెల్యేలతో మాట్లాడుకుని 25 మంది నుంచి మద్దతు పొంది మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు అజిత్ పవార్. దీనిపై NCP అధినేత శరద్ పవార్ (sharad pawar) స్పందించారు. అసలు అజిత్ ఎమ్మెల్యేలను ఎప్పుడు కలిసింది కూడా తనకు తెలీదని అన్నారు. అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో (devendra phadnavis) పాటు సీటు షేర్ చేసుకుంటారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. అజిత్‌తో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు.