KCR మ‌హారాష్ట్ర స్పీచ్‌.. క్రేజ్ మామూలుగా లేదుగా..!

Maharashtra: తెలంగాణ సీఎం KCR.. TRSను BRSగా మార్చి నేష‌న‌ల్ లెవ‌ల్‌కు తీసుకొచ్చారు. కేవ‌లం తెలంగాణ‌లోనే కాకుండా మ‌హారాష్ట్ర‌లోనూ (maharashtra) త‌న స‌త్తా చాటాల‌ని అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్భా నుంచి పోటీ చేయాల‌ని KCR నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించ‌ని KCR అక్క‌డ ప్ర‌సంగించారు. తెలంగాణ ఘ‌న‌త‌ను అక్క‌డి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అయితే ఆయ‌న స్పీచ్‌కు యూట్యూబ్‌లో నాలుగు రోజుల్లోనే 12 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. దాంతో అక్క‌డి ప్ర‌జ‌లు కూడా KCR వైపే మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. మ‌రికొంద‌రైతే అక్క‌డి వారికి KCR కొత్త కాబ‌ట్టి ఆయ‌న ఏం చెప్తారా అన్న ఆతృత‌తో విని ఉంటార‌ని, ఇంకొన్ని రోజులు పోతే ఆ వ్యూస్ కూడా త‌గ్గిపోతాయ‌ని ఎవ‌రి క‌న్‌క్లూజ‌న్స్ వారు రాసేసుకుంటున్నారు.