Sushanth Singh Rajput: నా తప్పు ఉంటే బూట్లతో కొట్టండి
Mumbai: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushanth singh rajput) కేసులో తన తప్పు ఉంటే బూట్లతో కొట్టండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు శివసేన (shiv sena) నేత రాహుల్ కనల్ (rahul kanal). మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు (uddhav thackeray) చెందిన శివసేన పార్టీ తరఫున పనిచేసిన రాహుల్ ఇప్పుడు.. శివసేన ఫ్యాక్షన్ పార్టీలో చేరారు. శివసేనలో అసమ్మతి నేతలు శివసేన ఫ్యాక్షన్ పేరుతో మరో పార్టీని స్థాపించారు. దీనికి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ శిండే (eknath shinde) లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రాహుల్.. ఏకనాథ్ పార్టీలోనే చేరారు.
రాహుల్ ఏకనాథ్‌తో చేతులు కలపగానే మీడియా ముందుకు వచ్చి కష్టపడి పనిచేసినందుకు ఉద్ధవ్ ఠాక్రే తనకు బాగానే బుద్ధిచెప్పారని అన్నారు. సుశాంత్ కేసు ఇంత లేట్ ఎందుకు అవుతోందో ఉద్ధవ్‌కే తెలుసని అన్నారు. త్వరలో సుశాంత్ కేసును లోతుగా పరిశీలించి న్యాయం గెలిపించాలని కోరారు. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే టీం స్పందిస్తూ.. సుశాంత్ కేసును ఏకనాథ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఫాస్ట్‌గా విచారిస్తోంది కాబట్టే కునాల్ పార్టీ మారిపోయాడని ఆరోపించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. సుశాంత్ కేసులో తన తప్పు ఉన్నట్లు రుజువైతే బూట్లతో కొట్టించుకుంటానని అన్నారు. సుశాంత్ సూసైడ్ కేసుతో పాటు అతని మేనేజర్ దిశా సాలియన్ కేసులో కూడా విచారణ వెంటనే జరిపి న్యాయం జరిగేలా చూడాలని ఏకనాథ్‌ను కోరారు.