Kidneys: కిడ్నీలు బాగుండాలంటే…!

Hyderabad: ర‌క్తాన్ని ఫిల్ట‌ర్ చేసి అన్ని ఆర్గన్స్‌కి స‌ర‌ఫ‌రా చేసేవి కిడ్నీలు (kindyes). అవి బాగుంటేనే మ‌నిషి బాగుంటాడు. కిడ్నీల (kidneys) ప‌నితీరు మెరుగుప‌రిచేందుకు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

బ్లూబెర్రీస్ (blueberries)
ఇవి కాస్త కాస్ట్లీ పండ్లు. అయినా ఫ‌ర్వాలేదు. వారానికి ఒక‌సారి వీటిని ఒక క‌ప్పు తిన్నా ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కిడ్నీకి చాలా మంచిది.

రెడ్ క్యాప్సిక‌మ్ (red bell peppers)
క్యాప్సిక‌మ్‌లో గ్రీన్, రెడ్, ఎల్లో ర‌కాలు ఉంటాయి. వాటిలో రెడ్ క్యాప్సిక‌మ్ (బెల్ పెప్ప‌ర్) ఎంతో మంచిది. స‌లాడ్స్‌లో వీటిని వాడుతుంటారు. మీకు ఎప్పుడైనా మార్కెట్లో క‌నిపిస్తే వెంట‌నే కొనేసి వండుకుని తినేయండి.

కాలిఫ్ల‌వ‌ర్ (cauliflower)
గోబీ పువ్వు ఎప్పుడూ మార్కెట్‌లో అందుబాటులోనే ఉంటుంది. క‌ర్రీ, గోబీ ప‌కోడీ ఇలా ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకోవ‌చ్చు. పొటాషియం త‌క్కువ‌గా ఫైబ‌ర్, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది కిడ్నీకి బెస్ట్ ఫ్రెండ్ లాంటిది.

వెల్లుల్లి (garlic)
యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాప‌ర్టీలు ఇందులో ఎక్కువ‌గా ఉంటాయి. కిడ్నీలు పాడ‌వ‌కుండా కాపాడే ఆహార ప‌దార్థాల్లో వెల్లుల్లి ఒక‌టి.

ఆలివ్ ఆయిల్ (olive oil)
ఇత‌ర వంట నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ది బెస్ట్. ఇన్‌ఫ్ల‌మేష‌న్ కాకుండా చూసుకుంటుంది.

యాపిల్స్ (apples)
రోజుకో యాపిల్ పండు తింటూ ఉండండి. ఒక్క కిడ్నీక‌నే కాదు దాదాపు అన్ని అవ‌య‌వాల‌కు యాపిల్ మంచిదే. కాక‌పోతే సూప‌ర్ మార్కెట్‌లో త‌ళ‌త‌ళ మెరిసిపోయే యాపిల్ కాకుండా తోపుడు బండ్ల‌పై అమ్మే వాటిని కొనండి. ఎందుకంటే మార్కెట్‌లో అమ్మేవాటిపై చూడ‌టానికి బాగుండాల‌ని వ్యాక్స్ పూస్తుంటారు.

వీటితో ఉల్లిపాయ‌, క్రాన్‌బెర్రీస్, చేప‌లు కూడా కిడ్నీ ప‌నితీరుకి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.