Procrastination: వాయిదాలు వేస్తుంటారా? ఈ టిప్స్ మీకోసమే
Hyderabad: ప్రొక్రాస్టినేషన్ (procrastination).. అంటే రేపు చేద్దాంలే.. ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ పనులను వాయిదా వేసుకుంటూ ఉండటం. ఈ ప్రొక్రాస్టినేషన్ వల్ల ప్రొఫెషనల్‌గా పర్సనల్‌గా చాలా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు నిపుణులు. అసలు దీనిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం.
మల్టీటాస్కింగ్ వద్దు
ఒకేసారి రెండు మూడు పనులు చేస్తుంటే దేని మీద కూడా సరిగ్గా కాన్‌సెట్రేట్ చేయలేకపోతారు. దీని వల్లే వాయిదాలు వేసే అలవాటు మొదలవుతుంది.
పర్‌ఫెక్ట్‌గా ఉండక్కర్లేదు
ఏది చేసినా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని అనుకుంటారు చాలా మంది. అలా కుదరదు. అందరికీ అస్సలు కుదరదు. పర్‌ఫెక్ట్‌గా లేనంత మాత్రాన అది వేస్ట్ అని కాదు. కనీసం ప్రయత్నించామని చెప్పుకోవడానికి నిదర్శనం. ఏదైనా పని మొదలుపెట్టడానికి ముందు పర్‌ఫెక్ట్‌గా రాకపోతే..? అని వచ్చే డౌట్ వల్లే ఆ పని చేయకుండా వాయిదా వేస్తుంటాం.
గోల్స్, డెడ్‌లైన్స్ ఇంపార్టెంట్
మీకంటూ గోల్స్, డెడ్‌లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలా ఏవైనా ఉంటేనే వాటిపై ఫోకస్ పెట్టాలన్న ధ్యాస కలుగుతుంది.
పెద్ద టాస్క్‌లు వద్దు
మీ ముందు ఏవైనా పెద్ద టాస్క్‌లు ఉన్నాయనుకోండి. వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి యత్నించండి. అప్పుడు ఒకేసారి మొత్తం భారం మీద పడినట్లు ఉండదు. దీని వల్ల మీ పని తీరు కూడా మెరుగుపడుతుంది.
ప్రశాంతమైన వాతావరణం ముఖ్యం
మీరు ఏదైనా పని చేసుకోవాలనుకుంటే కాస్త పీస్‌ఫుల్‌గా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. సౌండ్స్ రాకుండా మీ ఫోకస్ అంతా పని మీదే ఉండేలా చూసుకుంటే పనులు వాయిదా వేసుకునే అలవాటు తగ్గిపోతుంది.