Mallu Bhatti Vikramarka: షర్మిళ కాంగ్రెస్లోకి వస్తే తప్పేంటి?
Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka). కాంగ్రెస్ను తిట్టినోల్లే పార్టీలో ఉన్నారని షర్మిల వస్తే తప్పేంటి అంటూ రేవంత్ రెడ్డిపై (revanth reddy) విమర్శలు చేసారు. పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ (congress) పార్టీకి బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి పనిచేస్తున్నారని షర్మిలది మొదటినుండి కాంగ్రెస్ ఫ్యామిలీ అయినప్పుడు ఆమెను తీసుకుంటే తప్పేంటని అంటున్నారు. షర్మిళని కాంగ్రెస్లోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆపుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు.