Dominos: కస్టమర్‌కి ప్రపోజ్ చేసిన డెలివరీ బాయ్
Uttar Pradesh: డామినోస్లో (dominos) పనిచేస్తున్న ఓ డెలివరీ బాయ్ ఏకంగా కస్టమర్‌కే ప్రపోజ్ చేసారు. పిజ్జా ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేసాక ఆ అమ్మాయి వాట్సాప్‌కు పదే పదే మెసేజ్‌లు చేసాడు. దాంతో ఆ కస్టమర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. కబీర్ అనే యువకుడు డామినోస్లో (dominos) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. నిన్న కనిష్క అనే అమ్మాయి పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటే కబీర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ కబీర్ ఆ అమ్మాయికి వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టాడు. నా పేరు కబీర్. నిన్న మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చింది నేనే. నాకు మీరు నచ్చారు అంటూ మెసేజ్‌లు పంపాడు. దాంతో కనిష్క భయపడిపోయింది. వెంటనే తనకు వచ్చిన మెసేజ్‌లను ట్విటర్లో పోస్ట్ చేస్తూ కస్టమర్ ప్రైవేట్ వివరాలను ఇలా డెలివరీ బాయ్స్‌కి ఎలా ఇచ్చేస్తారు అంటూ డామినోస్పై మండిపడింది. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను కూడా ట్యాగ్ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.