Dharmendra: నా భ‌ర్తని అంటే ఊరుకోను..హేమ‌మాలినిని ఒప్పుకోను

Mumbai: అల‌నాటి న‌టులు ధ‌ర్మేంద్ర‌ (dharmendra), హేమ‌మాలినిల (hema malini) వివాహం గురించి అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టికే పెళ్లైన ధ‌ర్మేంద్ర‌.. హేమ‌మాలినిని పెళ్లి చేసుకోవ‌డానికి ఏకంగా ఇస్లాంలోకి క‌న్వ‌ర్ట్ అయ్యారు. ధ‌ర్మేంద్ర మొద‌టి భార్య ప్ర‌కాశ్‌ కౌర్‌తో న‌లుగురు పిల్ల‌ల‌కు తండ్ర‌య్యారు. అయినా కూడా హేమ‌మాలిని మ‌ర్చిపోలేక ఆయ‌న రెండో పెళ్లి చేసుకుని మ‌రో ఇద్ద‌ర్ని క‌న్నారు. అయితే రీసెంట్‌గా ధ‌ర్మేంద్ర (dharmendra) మ‌న‌వ‌డు క‌ర‌ణ్ డియోల్ (karan deol) పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. అయితే ఈ పెళ్లికి ధ‌ర్మేంద్ర హేమ‌మాలిని కానీ, పిల్ల‌ల‌ను కానీ పిల‌వ‌లేదు. ఇందుకు సారీ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు కూడా పెట్టారు. దీనిపై ధర్మేంద్ర మొద‌టి భార్య ప్ర‌కాశ్ కౌర్ స్పందించారు.

హేమ‌మాలినిని (hema malini) రెండో పెళ్లి చేసుకున్నందుకు త‌న భ‌ర్త‌ను అంద‌రూ అమ్మాయిల పిచ్చోడు అనేవార‌ని, ఇంకోసారి ఆ మాటంటే ఊరుకునేది లేద‌ని ఫైర్ అయ్యారు. ధ‌ర్మేంద్ర స్థానంలో ఎవ‌రు ఉన్నా హేమ‌మాలినినే చేసుకోవాల‌ని అనుకుంటార‌ని ధ‌ర్మేంద్ర మంచి భ‌ర్త కాక‌పోయినా మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నార‌ని తెలిపారు. సాటి మ‌హిళ‌గా హేమ‌మాలినికి స‌పోర్ట్ చేస్తాను కానీ ఓ త‌ల్లిగా భార్య‌గా మాత్రం ధ‌ర్మేంద్ర‌, హేమ‌మాలినిల రిలేషన్‌ను ఒప్పుకోన‌ని చెప్పారు.