YS Sharmila: కాంగ్రెస్‌లోకి రాకుండా ఆపుతున్నారా?
Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీని (ysrtp) కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని ఎప్పటినుంచో అనుకుంటున్నట్లు టాక్. ఇందుకోసమే గతంలో ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila).. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను (dk shivakumar) కలిసారు. పార్టీని విలీనం చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ పాలేరు నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ హై కమాండ్ ఒప్పుకోవడంతో విలీనానికి ఓకే చెప్పారట షర్మిళ (ys sharmila). గతంలో పలుమార్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయాలని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అడిగినప్పటికీ షర్మిళ ఒప్పుకోలేదు. కావాలంటే పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని తరచూ వాదించేవారు.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే.. షర్మిళ పార్టీని కాంగ్రెస్‌లో (congress) విలీనం కాకుండా చేసేందుకు అదే పార్టీలోని కొందరు వ్యక్తులు ప్లాన్లు వేస్తున్నారట. అందులో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా ఒకరని తెలుస్తోంది. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన షర్మిల పార్టీని విలీనం చేస్తే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దెబ్బ తింటాయి అని చెప్పినట్లు సమాచారం. 2018లో చంద్రబాబుతో పొత్తు తరహాలో దెబ్బతింటామని, కావాలంటే ఆమె సేవలను ఆంధ్రలో వాడుకుందామని పలువురు కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే ఆంధ్రలో కాంగ్రెస్ తరపున పనిచేసేందుకు షర్మిల ససేమిరా అంటున్నారు. తెలంగాణలో తప్ప ఇంకెక్కడ చేయనని షర్మిల తెగేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.