Manipur: సీఎంగారూ.. మీరు రాజీనామా చేయకండి ప్లీజ్!
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్‌లో (manipur) అల్లర్లు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకుండా పోయింది. దాంతో ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌ను (n biren singh) రాజీనామా చేయమని డిమాండ్ చేసాయి. ఈ నేపథ్యంలో ఆయన తన ఓటమిని ఒప్పుకుని రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఆ రాష్ట్ర ప్రజలకు తెలీడంతో ఆయన్ను రాజీనామా చేయకుండా ఆపాలనుకున్నారు. మహిళలంతా కలిసి ఇంఫాల్‌లోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. బిరేన్ సింగ్ రాజీనామా పత్రాన్ని పట్టుకుని గవర్నర్ నివాసానికి వెళ్తుండగా ఆ గుంపును చూసి ఆయన మనసు మార్చుకున్నారు.
వెంటనే రాజీనామా పత్రాన్ని చించేసిన ఘటన వైరల్‌గా మారింది. మణిపూర్ బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) వెళ్లారు. తాను ఆ సమయంలో ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయదలచుకోలేదని రాహుల్ తెలిపారు. వీలైనంత త్వరగా తనలాగా ఆలోచించే నేతలతో మాట్లాడి మణిపూర్‌లో ప్రశాంతత తీసుకురావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.