Mega Princess: అంబానీ నుంచి గిఫ్ట్‌గా బంగారు ఉయ్యాల‌..?

Hyderabad: మెగా ప్రిన్సెస్ (mega princess) రాక‌తో మెగా కుటుంబంలో ఆనందంలో మునిగి తేలుతోంది. అంత‌కంటే ఎక్కువ‌గా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు పాప‌ని చూస్తామా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌ (ram charan), ఉపాస‌న (upasana) కూతురికి సంబంధించి ఓ రూమ‌ర్ తెగ వైర‌ల్ అవుతోంది. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (mukesh ambani).. మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్‌. పాప పుట్టిన సంద‌ర్భంగా బంగారు ఉయ్యాల‌ను కానుక‌గా పంపారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు కానీ.. బంగారు ఉయ్యాల ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి ఇది నిజ‌మా కాదా అనేది చ‌ర‌ణ్ నుంచే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాలి.