Suryapet: పట్టపగలు కత్తులతో దాడి

Suryapet: సూర్యాపేటలో (suryapet) ప‌ట్ట‌ప‌గ‌లు క‌త్తుల‌తో దాడి చేసారు దుండ‌గులు. గురువారం ఉద‌యం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు. వీరి మ‌ధ్య పాత క‌క్ష‌లు ఉన్నాయి. కాగా సంతోష్ మీద బంటి దాడి చేయించాడు. ఇందుకోసం ఇంకొంత మందితో క‌లిసి క‌త్తుల‌తో వెంబ‌డించాడు. స్థానికులు చూసి వారిని ఆపేందుకు య‌త్నించ‌డంతో సంతోష్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌న్ని స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. ప్రాణాపాయం లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. బాధితుడు సంతోష్ గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు.