Healthy Relationship: బంధం బాగుండాలంటే ఇవి తప్ప‌నిస‌రి

Hyderabad: ప‌ర్‌ఫెక్ట్ అబ్బాయి లేదా ప‌ర్‌ఫెక్ట్ అమ్మాయి దొరికితేనే ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటాను అంటుంటారు (healthy relationship). ప‌ర్‌ఫెక్ట్ అనేది ఏమీ ఉండ‌దు. ఒక‌రికొక‌రు ఇష్టం ఉన్న‌ప్పుడు ఇద్ద‌రూ క‌లిసే ఆ బంధాన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా మార్చుకోవాల‌ని అంటున్నారు రిలేష‌న్‌షిప్ ఎక్స్‌ప‌ర్ట్స్.

రెస్పెక్ట్
ఇది రిలేష‌న్‌షిప్‌కి పిల్ల‌ర్ లాంటిది. ఇది లేక‌పోతే ఆ బంధం ఎంతో కాలం నిల‌బ‌డ‌దు.

వ్య‌క్తిత్వం
ఒక‌రంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉన్న‌ప్పుడు వారి వ్య‌క్తిత్వాల‌ను కూడా గౌర‌వించేలా ఉండాలి. నువ్వు త‌క్కువ అంటే నువ్వు త‌క్కువ అనే మాటే రాకూడ‌దు.

మాట్లాడండి.. వినండి
ఎప్పుడూ ఒక‌రే మాట్లాడాలి, ఒక‌రే వినాలంటే అవ్వ‌దు. మీ పార్ట్‌న‌ర్ ఏం చెప్పాల‌నుకుంటున్నారో శ్ర‌ద్ధ‌గా వినండి. అదే విధంగా అంతే క్లియ‌ర్‌గా మాట్లాడుకోండి. అప్పుడే ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధ‌లు రాకుండా ఉండాలి. అందుకే అంటుంటారు క‌మ్యునికేష‌న్ ఈజ్ ది కీ అని.

రియాల్టీ
రియాల్టీని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏదో ఊహాలోకంలో బ‌తికేస్తున్న‌ట్లు కాకుండా రియాల్టీ చెక్స్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్
మీ పార్టన‌ర్ ఎక్కువ‌గా ఎమోష‌ల్ అవుతుంటే ఇరిటేట్ అవ్వ‌కండి. ద‌గ్గ‌రికి తీసుకుని ఓదార్చండి. ఏం జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. ఎప్పుడూ ఏడుపేనా.. అనే మాట మాత్రం మీ నోటి నుంచి అస్సలు రాకూడ‌దు సుమీ..!