Sree Vishnu: పెళ్లి చేసుకోడానికే నాతో సినిమాలు చేస్తున్నారు
Hyderabad: సామజవరగమన (samajavaragamana) సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్రీ విష్ణు (sree vishnu). ఎక్కడ చూసినా మంచి రేటింగ్స్, పాజిటివ్ టాక్‌తో సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. బ్రోచేవారెవరురా సినిమా తర్వాత మంచి కామెడీ సినిమాను అందించారు శ్రీ విష్ణు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసారు. అయితే ఓ నెటిజన్ మాత్రం పెళ్లి గురించి ప్రస్తావించాడు. ఇప్పటివరకు శ్రీ విష్ణుతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరికైతే పెళ్లి కావాలో అలాంటి డైరెక్టర్లనే వెతికి శ్రీ విష్ణు సినిమాలు చేస్తున్నారేమో అని ఆ నెటిజన్ అడిగాడు. ఇందుకు శ్రీ విష్ణు రిప్లై ఇస్తూ.. వాళ్లే పెళ్లిళ్లు కావాలని నాతో సినిమాలు చేస్తున్నారు బ్రో అని ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఇంకో నెటిజన్ అయితే.. అన్నా అమ్మాయిని ఎలా పడియాలో ఐడియా చెప్పు అని అడిగాడు. దీనికి శ్రీ విష్ణు.. కాళ్లు అడ్డుపెట్టు అని దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు.