Ram Charan: చ‌ర‌ణ్, ఉపాస‌న షిఫ్ట్ అవుతున్నారా?

Hyderabad: మెగా క‌పుల్ రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), ఉపాస‌న‌లు (upasana) రీసెంట్‌గానే పండంటి ఆడ‌పిల్ల‌కు తల్లిదండ్రుల‌య్యారు. ప్ర‌స‌వం కోసం త‌న అత్తింటివారితో గ‌డపాల‌ని డెలివ‌రీకి నెల ముందు చ‌ర‌ణ్‌, ఉపాస‌న చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు డెలివరీ అయ్యాక కూడా అక్క‌డే ఉన్నారు. అయితే నెలలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న త‌మ బిడ్డ‌తో క‌లిసి మోయినాబాద్‌కు షిఫ్ట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మోయినాబాద్‌లో ఉపాస‌న త‌ల్లి శోభ‌న కామినేని (shobana kamineni) ఉంటున్నారు. ఇంటి చుట్టూ చెట్ల‌తో వారి ఇల్లు ఓ మినీ ఫారెస్ట్‌లా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందట‌. వ‌ర్షాకాలం కావడంతో ఈ స‌మ‌యంలో అక్క‌డ ఉంటే చాలా బాగుంటుంద‌ని ఉపాస‌న‌ (upasana), చ‌ర‌ణ్ (charan) అనుకున్నార‌ట‌. ఇక పాప పేరు ఏంటి అన్న‌ది రివీల్ చేయ‌లేదు. ఫ్యాన్స్ కూడా మెగా ప్రిన్సెస్‌ను చూడాల‌ని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.