Best Boyfriend: ఎంత అదృష్టవంతురాలో…!
Hyderabad: బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ (best boyfriend) లేదా బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని కోరుకోని అబ్బాయిలు, అమ్మాయిలు ఉండరు. ఈ మధ్యకాలంలో ట్రూ లవ్ అనేది దొరకడం చాలా రేర్ అనుకోండి. కానీ పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి నిజంగా ఎంతో అదృష్టవంతురాలనే చెప్పాలి. ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే. అమెరికాకు చెందిన అలెగ్జాండర్ అనే యువకుడు.. తన లవ్ స్టోరీ మొదలై ఏడాది కావొస్తున్న సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్‌కి ఏదైనా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. ఎప్పటినుంచో తన గర్ల్‌ఫ్రెండ్‌లో ఓ లగ్జరీ బ్యాగ్ అడుగుతోంది. కానీ డబ్బులు లేకపోవడంతో అతను కొనివ్వలేకపోయాడు. అయినా కూడా తన ప్రియురాలు ఆశపడిందని ఏం చేసాడో తెలుసా?
ప్రముఖ ఫ్రెంచ్ బ్రాండ్ అయిన హర్మె బెర్కిన్ (hermes berkin) బ్యాగును స్వయంగా తయారుచేసి మరీ ఇచ్చాడు. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్పా అనుకోకండి. హర్మె బ్రాండ్‌కి చెందిన బ్యాగుల ధర అక్షరాలా రూ.80 లక్షలు అలా ఉంటాయి. మరి అంతటి ఖరీదైన బ్యాగును తయారుచేయాలంటే మామూలు విషయం కాదు కదా. అందుకే తన ఇంటి పక్కనున్న అన్ని మాల్స్, షాప్స్‌లో కనుక్కుని బెర్కిన్ బ్యాగు తయారుచేయడానికి వాడే మొసలి చర్మంతో తయారుచేసిన లెదర్‌ను సాధించాడు. ఈ మొసలి చర్మంతో తయారుచేసిన లెదరే చాలా ఖరీదైనది. అలా అచ్చం బెర్కిన్ బ్యాగులాగే తయారుచేసాడు. ఇందుకు అతనికి నెల రోజుల సమయం పట్టిందట. చేతులు నొప్పి పెడుతున్నా తన గర్ల్‌ఫ్రెండ్ కోసం కష్టపడి తయారుచేసానని చెప్పాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఆ బ్యాగు ఇవ్వగానే తను కొనిచ్చాడని అనుకుంది. లేదు స్వయంగా తయారుచేసాను అని చెప్పగానే ఆమె ఆనందంతో కన్నీళ్లుపెట్టుకుంది. నిజంగానే అలెగ్జాండర్ బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అంటూ అతని ఇన్‌స్టాగ్రామ్ వీడియోకి తెగ కామెంట్స్ పెడుతున్నారు.