Tharun Bhasker: రాహుకాలంలో పుట్టి ఉంటా!

Hyderabad: రాహుకాలంలో పుట్టి ఉంటా అంటూ బాధ‌ప‌డుతున్నారు త‌రుణ్ భాస్క‌ర్ (tharun bhasker). ఆయ‌న డైరెక్ట్ చేసిన ఈ న‌గ‌రానికి ఏమైంది (ee nagaraniki yemaindi) సినిమా రీ రిలీజ్ అవ‌బోతోంది. అయితే ఏపీ, తెలంగాణ‌లో టికెట్లు రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయ‌ట‌. ఈ విష‌యాన్ని త‌రుణ్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ షాక‌య్యారు. బాయ్స్ అండ్ గ‌ర్ల్స్.. ఇదేం పిచ్చి. మ‌జాక్ అయిపోయిందా? చాలా మంది మేం బ్లాక్ చేసాం అనుకుంటున్నారు. థియేట‌ర్‌ని మైండ్‌ని బ్లాక్ చేసింది ఆడియన్స్. ఇదేదో సినిమా రిలీజ్ అయిన‌ప్పుడే సోల్డ్ అవుట్ అయ్యేలా చేసుంటే ఈ పాటికి నేను గోవాలో ఇల్లు క‌ట్టుకునేవాడిని. రాహుకాలంలో పుట్టి ఉంటా అంటూ ఫ‌న్నీ కామెంట్ చేసారు త‌రుణ్‌.

విశ్వ‌క్ సేన్ (vishwak sen), సుశాంత్ (sushanth), అభిన‌వ్ గోమ‌ఠం (abhinav gomatam), వెంక‌టేష్ కాకుమాను (venkatesh kakumanu) న‌టించిన ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. అప్ప‌ట్లో సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ అన్నీ మీమ్ టెంప్లేట్స్ అయిపోయాయి. ఇది లేక‌పోతే మీమ్సే లేవు అన్న రేంజ్‌లో సినిమా పాపుల‌ర్ అయిపోయింది. దాంతో సినిమాను రీ రిలీజ్ చేయాల‌ని చాలా మంది ఫ్యాన్స్ త‌రుణ్ భాస్కర్‌ను అడిగారు. ఫ్యాన్స్ కోస‌మ‌ని త‌రుణ్ రీ రిలీజ్ చేయిస్తున్నారు.