Shyam సూసైడ్ వీడియో నిజమేనా?
AP: Jr NTR ఫ్యాన్ శ్యాం (shyam) సూసైడ్ చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తూర్పు గోదావారి జిల్లాకు చెందిన శ్యాం (shyam) అనే కుర్రాడు నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే టీడీపీ నేతలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అతనిది సూసైడ్ కాదు మర్డర్ అని ఆరోపిస్తున్నారు. సూసైడ్ చేసుకునేవాడు డ్రగ్స్ జేబులో ఎందుకు పెట్టుకుంటాడు? కాళ్లు నేలకు ఎలా తాకుతాయి? చెయ్యి కోసుకుని ఎందుకు ఉరేసుకుంటాడు? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శ్యాం సూసైడ్ చేసుకోవడానికి ముందు తీసుకున్న ఓ సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది.
“నన్ను క్షమించండి అమ్మానాన్నా. నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ నేను చాలా వేస్ట్. నాకు ఉద్యోగం చేయాలని అస్సలు లేదు. అందుకే మీకు దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నా. వచ్చే జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుడతాను” అంటూ వీడియోలో శ్యాం చెప్పాడు. అయితే బ్యాక్గ్రౌండ్లో అడ్రెస్ పెట్టూ అంటూ ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది. శ్యాం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరూ లేని సమయంలో ఇలాంటి సెల్ఫీ వీడియో పెట్టాలనుకుంటాడు. శ్యాం రూంలో ఎవరో ఉన్నారని తెలుస్తోంది. అలాంటప్పుడు అతను ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు ఆపలేదు అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇది నిజంగా శ్యాంకు సంబంధించిన వీడియోనేనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.