Sivaji: ఆ క‌సి ఎలా ఉంటుందో ఎన్నిక‌లప్పుడు చూస్తారుగా

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో క‌సితో ఉన్నార‌ని, ఆ క‌సి ఎలా ఉంటుందో ఎన్నిక‌ల (ap elections) స‌మ‌యంలో చూస్తార‌ని ప్ర‌ముఖ న‌టుడు శివాజీ (sivaji) అన్నారు. ఆయ‌న ఎప్ప‌టినుంచో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు (pawan kalyan) స‌పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ వారాహి యాత్ర‌తో (varahi yatra) బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న స‌భ‌ల‌కు ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో శివాజీ (sivaji) మాట్లాడుతూ.. త‌న‌కున్న సమాచారం ప్రకారం, అనుభవం ప్రకారం ఏపీ జనాలు చాలా కసిగా ఉన్నారని, పైకి అంతా సాఫీగా కనిపించొచ్చు కానీ వాళ్ళ కసి ఎలా ఉంటదో ఎన్నిక‌ల‌ప్పుడు చూస్తార‌ని అన్నారు. దాంతో శివాజీ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలోనూ పవన్ కళ్యాణ్ ఆంజనేయుడు లాంటి వాడని తన బలం తనకు తెలియడం లేదని అంతటి సమ్మోహన శక్తి మరెవరికీ లేదని శివాజీ అన్నారు.