Suraj Kumar: ఫస్ట్ సినిమా.. ఇంత‌లో యాక్సిడెంట్

Bengaluru: కన్నడ న‌టుడు సూర‌జ్ కుమార్ (suraj kumar) అలియాస్ ధృవ‌న్‌కు (dhruwan) యాక్సిడెంట్ జ‌రిగింది. ఊటీ నుంచి మైసూరుకు స్కూటీపై వెళ్తుండ‌గా ఎదురుగా వ‌స్తున్న ట్రాక్ట‌ర్‌ను ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి టిప్ప‌ర్ లారీకి ఢీకొట్టాడు. దాంతో అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంట‌నే మైసూరులోని మ‌నిపాల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే సూర‌జ్ కుడి కాలికి తీవ్రంగా గాయం అవ‌డంతో దానిని తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. సూర‌జ్ ర‌థం అనే క‌న్న‌డ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అత‌ని కాలు పోవ‌డంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ (priya prakash warrior) హీరోయిన్‌గా న‌టిస్తోంది. సూరజ్‌ను ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ రాజ్‌కుమార్ (shivakumar) ఆయ‌న భార్య ప‌రామ‌ర్శించారు. డెబ్యూ సినిమాలో న‌టిస్తుండ‌గానే ఈ దారుణం జ‌ర‌గ‌డంతో సూర‌జ్ (suraj kumar) తీవ్రంగా బాధ‌ప‌డుతున్నాడు. కొన్ని నెల‌ల పాటు ఆయ‌న ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితి నెల‌కొంది.