Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎంత మంచిదో తెలుసా?
Hyderabad: కొన్ని మొక్కలను (plants) ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. చూడటానికి అందంగా ఉండటమే కాకుండా మనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లో ఉంచుకునే కొన్ని మొక్కలు ఆక్సిజన్‌ను (oxygen) రిలీజ్ చేస్తాయి. దాంతో మనం పీల్చుకునే గాలి ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంతకీ అవేం మొక్కలో చూద్దాం.
స్నేక్ ప్లాంట్ (snake plant)
ఇంట్లో పెంచుకునే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ ఒకటి. చూడటానికి పాము ఆకారంలో ఉండే ఈ మొక్కలు ఇంట్లో మనం పీల్చుకునే గాలిని ఫ్రెష్‌గా మార్చడమే కాదు రాత్రిళ్లు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయి.
అలోవెరా (aloevera)
ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో రాత్రిళ్లు ఆక్సిజన్ రిలీజ్ చేయడంలో అలోవెరా బెస్ట మొక్క అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్.
వేప చెట్టు (neem tree)
బయట వీధికి ఒక వేప చెట్టు ఉంటోంది. ఇది ఇంట్లో పెంచుకోవడం కుదరదు కాబట్టి.. ఇంటి బయట గోడకు పక్కనే ఒక మొక్క నాటేందుకు ట్రై చేయండి. అది పెరిగి వాటి మొక్కలు ఇంట్లో ఉన్న కిటికీ పక్కన ఉన్నా చాలు ఎంతో మంచిది.
రావి చెట్టు (peepal tree)
మనం దైవంగా భావించే రావి చెట్టు ఇంటి ముందు ఉంటే ఎంతో మంచిది. ఇక వేప, రావి కలిసి ఉన్నాయంటే మరీ మంచిది. రెండింటి నుంచి రాత్రిళ్లు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది.
పోథోస్ (pothos)
చూడటానికి కాస్త మనీ ప్లాంట్‌లా కనిపిస్తుంది ఈ పోథోస్ మొక్క. కానీ ఇది వేరు. మార్కెట్‌లో ఈజీగా దొరికే ఈ మొక్కను కూడా ఇంట్లో పెంచుకునేందుకు ట్రై చేయండి.