Salman Khan: స‌ల్మాన్‌ని చంప‌డం ఖాయం అంటున్న గ్యాంగ్‌స్ట‌ర్

Mumbai: స‌ల్మాన్ ఖాన్‌ను (salman khan) చంపితీర‌తాం అంటూ డైరెక్ట్‌గానే బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు ప‌రారీలో ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ గోల్డీ బ్రార్ (goldy brar). ప్ర‌ముఖ పంజాబీ సింగ‌ర్ సిద్ధూ మూసేవాలాను (siddhu moosewala) హ‌త్య చేయించింది కూడా గోల్డీనే. అత‌న్ని చంపిన‌ట్లే స‌ల్మాన్‌ని కూడా చంపేస్తామ‌ని ఎప్ప‌టినుంచో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. స‌ల్మాన్ (salman khan) త‌మ హిట్ లిస్ట్‌లో ఉన్నాడ‌ని అంటున్నాడు. దాంతో స‌ల్మాన్‌ని మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌మెంట్ (maharashtra government) ఒక లైసెన్స్‌డ్ గ‌న్ను Y+ సెక్యూరిటీని క‌ల్పించింది. అయినా కూడా గోల్డీ నుంచి బెదిరింపులు ఆగ‌డం లేదు.

కెన‌డాలో దాక్కున్న గోల్డీ బ్రార్‌ను ఓ ఇంగ్లీష్ ఛానెల్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ స‌మ‌యంలోనే గోల్డీ ధైర్యంగా ఇలాంటి కామెంట్స్ చేసాడు. “స‌ల్మాన్‌ని చంప‌డ‌మే మా భాయ్ లారెన్స్ బిష్ణోయ్ ల‌క్ష్యం. చంపే తీర‌తాం. అత‌న్నే కాదు.. మాకున్న శ‌త్రువులు అంద‌రినీ చంపేస్తాం. మా భాయ్ ఎవ‌రినీ క్ష‌మించ‌డు. ఆయ‌న‌కు న‌చ్చితేనే క్ష‌మిస్తాడు” అని తెలిపాడు. 2017లో స్టూడెంట్ వీసాతో కెనడా వెళ్లిన గోల్డీ బ్రార్ అక్క‌డి నుంచే ప్లాన్ వేసి మ‌రీ సిద్ధూ మూసేవాలాను చంపించాడు.