ప్రేయ‌సి కోసం కిడ్నాప్..BJP నేత చక్ర‌ధ‌ర్ గౌడ్ నిర్వాకం

Hyderabad: ఉద్యోగాల పేరిట వంద‌లాది మంది యువ‌తీ యువ‌కుల‌ను మోసం చేసిన సిద్ధిపేట‌ BJP నేత చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ (chakradhar goud) గురించి షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పడుతున్నాయి. ఓ యువ‌తితో స‌హ‌జీవ‌నం చేస్తూ, ఆమె మాజీ ప్రియుడ్ని కిడ్నాప్ చేయాల‌నుకున్నాడు. కిడ్నాప్ చేయించిన స‌మ‌యంలో తీసిన వీడియోలు బయ‌టికి రావ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఫార్మర్స్ ఫస్ట్ అనే సంస్థ‌ను న‌డుపుతున్న‌ ఆరోషిక రెడ్డి అలియాస్ అన్షిత రెడ్డి అనే యువ‌తి అవినాష్ రెడ్డి అనే యువ‌కుడితో ఎనిమిదేళ్లుగా ప్రేమ‌లో ఉంది. కొన్ని నెల‌ల క్రితం ఆరోషిక‌.. అవినాష్‌ను 25 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే అవినాష్‌తో ప్రేమ‌గా న‌టిస్తూనే ఆరోషిక‌.. చ‌క్ర‌ధ‌ర్ గౌడ్‌తో (chakradhar goud) 8 నెలలుగా సహజీవనం చేస్తోంది. విష‌యం తెలిసి త‌న నుంచి తీసుకున్న 25 లక్షలు తిరిగివ్వాల‌ని అవినాష్ రెడ్డి ఒత్తిడి చేసాడు. దాంతో అత‌న్ని కిడ్నాప్ చేసి డ‌బ్బు ఎగ్గొట్టాల‌ని చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ ప్లాన్ వేసాడు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఘట్‌కేసర్‌లోని వరంగల్ హైవేపై ఉన్న వందన హోటల్ కు వ‌స్తే రూ.25 ల‌క్ష‌లు ఇచ్చేస్తాన‌ని ఆరోషిక చేత చెప్పించాడు.

అత‌ని మాట‌లు నమ్మి ఆ హోట‌ల్‌కు వెళ్లాడు అవినాష్ రెడ్డి. అత‌ను రాగానే మ‌నుషుల‌ను పెట్టించి కారులోకి ఎక్కించి కొట్టించాడు. గతంలో స్నేహితుడి భార్య మీద అత్యాచారం యత్నించిన కేసులో, కాల్ సెంటర్ పేరిట అమాయకమైన యువకుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో చక్రధర్ గౌడ్ అరెస్ట్ అయ్యి బ‌య‌టికి వచ్చినా అతని తీరు మాత్రం మారలేదు.