Lokesh Kanagaraj: ప్ర‌భాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమాగా తీస్తా

Hyderabad: సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ (lokesh kanagaraj).. యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌తో (prabhas) సినిమా తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమా ఇద్ద‌రి కెరీర్స్‌లో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోతుంద‌ని ఇప్ప‌టినుంచే హైప్ ఎక్కించేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ (prashanth neel) డైరెక్ష‌న్‌లో స‌లార్ (salaar), నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ప్రాజెక్ట్-కK సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ (prabhas).. ఈ రెండు కంప్లీట్ అయ్యాకే లోకేష్‌కు డేట్స్ ఇస్తార‌ని తెలుస్తోంది. సినిమాల్లోనే ఉండిపోన‌ని, ఓ 10 మంచి సినిమాలు తీసి డైరెక్ష‌న్‌కు గుడ్‌బై చెప్పేస్తాన‌ని లోకేష్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఇప్ప‌టినుంచే ఏ హీరోతో ప‌నిచేయాలా అని ప్లాన్లు చేసేసుకుంటున్నారు. లోకేష్ ఇప్పుడు విజ‌య్‌తో లియో సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాల‌కు ఇది కంటిన్యుయేష‌న్‌గా రాబోతోందా లేక ఓన్లీ ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా రాబోతోందా అనేది వేచి చూడాలి.