Etela Rajender: కాంగ్రెస్‌లో చేర‌నున్న ఈటెల‌?

Hyderabad: ఈటెల రాజేంద‌ర్‌ను (etela rajender) ఆయ‌న అనుచ‌రులు ప్రెష‌ర్ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సమ‌యంలో BJP, కాంగ్రెస్ (congress) పోటా పోటీగా ప్ర‌చారాలు చేసిన‌ప్ప‌టికీ.. క‌న్న‌డ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కే మొగ్గు చూసారు. దాంతో సౌత్‌లో BJP గ్రాఫ్ ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఇక తెలంగాణ‌లో BRS ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ వ‌ల్లే అవుతుంద‌ని ఇక BJPని వ‌దిలేసి కాంగ్రెస్‌లో చేరిపోతే బెట‌ర్ అని స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. దాంతో ఈటెల కూడా ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అందులోనూ BJP ఇచ్చిన అడ్మిష‌న్స్ క‌మిటీ అధ్య‌క్షుడి పోస్ట్ ఎటూ ఈటెకు ఇష్టం లేదు. దాంతో ఆయ‌న BJPపై కోపంతో ఆ పార్టీకి చెందిన ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో హైక‌మాండ్ నుంచి దిల్లీకి రావాల‌ని ఈటెల‌కు కాల్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఆ మీటింగ్‌లోనే ఈటెల త‌న మ‌న‌సులో మాట‌ను కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో కూడా చెప్ప‌నున్నార‌ట‌. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈటెల నిర్ణ‌యం ఏంటో తెలిసిపోతుంది.