Vijay Devarakonda: రెస్టారెంట్‌లో విజ‌య్‌, ర‌ష్మిక మంద‌న‌

Hyderabad: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda), ర‌ష్మిక మంద‌న (rashmika mandanna) డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం ఇద్ద‌రూ క‌న్ఫామ్ చేయ‌లేదు కానీ కొన్నిసార్లు క‌లిసి మాల్దీవ్స్‌కి క‌లిసి వెళ్లిన‌ప్పుడు ఒకే ప్ర‌దేశంలో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేయ‌డంతో వీరు డేటింగ్‌లో ఉన్నార‌ని హాఫ్ క్లారిటీ వ‌చ్చేసింది. ఇదే విష‌యం గురించి ర‌ష్మిక‌ను అడిగితే.. ఫ్రెండ్స్‌తో క‌లిసి బ‌య‌టికి వెళ్ల‌డంలో త‌ప్పేముంది అని చెప్పింది. ఆ తర్వాత విజ‌య్‌కి ర‌ష్మిక‌కి బ్రేకప్ అయింద‌ని కూడా రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ ఏంటంటే.. విజ‌య్‌, రష్మిక క‌లిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్‌తో క‌లిసి రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నార‌ట‌. దాంతో మ‌ళ్లీ వీరిద్ద‌రూ ప్యాచ్ అప్ అయిపోయారు అంటున్నారు. పైగా నిన్న విజ‌య్ దేవ‌ర‌కొండ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైర‌ల్ అవుతోంది. విజ‌య్ బెస్ట్ ఫ్రెండ్ ఒక‌రు త‌న బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్నారట‌. దానిని స్టోరీలో పెట్టి.. బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే ఉంట‌దీ… అని స్టోరీ పెట్టాడు. దాంతో విజ‌య్ కూడా త‌న బెస్ట్ ఫ్రెండ్ అయిన ర‌ష్మిక‌నే చేసుకునేలా ఉన్నాడే అని ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.