Titan Submarine: ప్చ్‌.. అంద‌రూ చ‌నిపోయారు

America: ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేసి టైటానిక్ షిప్ (titan submarine) శ‌క‌లాల‌ను చూడ‌టానికి వెళ్లారు. కాస్త రిస్క్ అయిన‌ప్ప‌టికీ ఒక్క‌సారైనా ఆ అతిపెద్ద షిప్ (titanic) ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ఏ స్థితిలో చూడాల‌నుకున్నారు. ఈ ఆతృతే వారి ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. మృతుల్లో బ్రిట‌న్‌కు చెందిన అన్వేష‌కుడు, పాకిస్థాన్‌కు చెందిన ఓ బిలియ‌నేర్‌, అత‌ని కుమారుడు, స‌బ్‌మెరైన్ సీఈఓ, ఫ్రాన్స్‌కి చెందిన ఓ పైల‌ట్ ఉన్నారు. వీరంతా క‌లిసి ఆదివారం మినీ స‌బ్‌మెరైన్‌లో (titan submarine) న్యూఫౌండ్‌ల్యాండ్‌లో బ‌య‌లుదేరారు. అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో 12 వేల మీట‌ర్ల లోతులో ఉన్న టైటానిక్ శ‌క‌లాల‌ను చూసేందుకు వీరు వెళ్లారు. స‌బ్‌మెరైన్ కొన్ని గంట‌ల త‌ర్వాత‌.. పేరెంట్ స‌బ్‌మెరైన్‌తో రాడార్ తెగిపోయింది. దాంతో స‌బ్ మెరైన్ నీటిలో గ‌ల్లంతైపోయింది.

అయితే ఆ స‌బ్‌మెరైన్‌లో (titan submarine) సరిగ్గా ఐదు రోజుల‌కు స‌రిప‌డా ఆక్సిజ‌న్ మాత్ర‌మే ఉంది. గురువారం రాత్రి 7.15 వ‌ర‌కే ఆక్సిజ‌న్ అందుతుంద‌ని ఆ త‌ర్వాత ఊపిరాడ‌క చ‌నిపోతార‌ని స‌బ్ మెరైన్ నిర్వాహ‌కులు అమెరిక‌న్ కోస్ట్ గార్డు అధికారుల‌కు చెప్పారు. దాంతో అస‌లు వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారా లేదా అనే ఉత్కంఠ మొద‌లైంది. అమెరికా, కెన‌డా దేశాల‌కు చెందిన కోస్ట్‌గార్డులు అన్ని ర‌కాలుగా స‌బ్‌మెరైన్ ఆచూకీ తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. నిన్న అర్థ‌రాత్రి టైటానిక్ షిప్ శ‌కలాల‌కు 400 మీట‌ర్ల దూరంలో స‌బ్‌మెరైన్ శ‌క‌లాలు ల‌భ్య‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. స‌బ్‌మెరైన్‌లో ప్రెష‌ర్ ఎక్కువ అవ‌డంతో అది పేలిపోయి ఐదుగురు అదే మ‌హాస‌ముద్రంలో ప్రాణాల‌ను వ‌దిలేసారు. మృతుల కుటుంబీకుల‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేసి సంతాపం తెలిపారు.