Sreeleela: అన్ని సినిమాల్లో అంటే బోర్ కొట్టదా?
Hyderabad: శ్రీలీల..శ్రీలీల.. శ్రీలీల.. (sreeleela) టాలీవుడ్‌లో ఇదే పేరు వినిపిస్తోంది ఇప్పుడు. పెళ్లిసందడి సినిమాతో ఓ రేంజ్‌లో ఆకట్టుకున్న ఈ కన్నడ బ్యూటీకి చేతినిండా సినిమాలే. వరుసగా దాదాపు 7 సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడంటే శ్రీలీల (sreeleela) ఫ్రెష్ ఫేస్ కాబట్టి ఆమెను సినిమాల్లో తెగ తీసేసుకుంటున్నారు. కానీ ప్రతి సినిమాలో ఆమెనే చూడాలంటే జనాలకి బోర్ కొట్టదా? అనే చర్చ మొదలైంది. ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా రిలీజ్ అయితే.. థియేటర్‌లో ఒకే హీరోయిన్ ఫేస్ చూడాల్సి వస్తుంది. దాంతో ఆడియన్స్ కూడా విసిగిపోతారు. గతంలో మెహ్రీన్ (mehreen) విషయంలోనూ ఇదే జరిగింది. ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమాకి తీసేసుకునేవారు. అలా కొంతకాలం పాటు తెగ సినిమాలు చేసేసింది. ఇప్పుడు కనీసం అరకొర సినిమాలు కూడా రావడంలేదు.
శ్రీలీల (sreeleela) వయసులో చిన్నది అందులోనూ చూడటానికి బబ్లీగా ఉంటుంది. కాబట్టి కామన్‌గా హీరో పక్క ఒక పాటలో ఒక రొమాంటిక్ సీన్‌లో నటించే సినిమాలకు మాత్రమే ఒకే చెప్తోంది. ఇలాంటి హీరోయిన్లు ఎంతో కాలం ఇండస్ట్రీలో కొనసాగలేరు. ఒకే హీరోయిన్‌ని ఎక్కువ సినిమాల్ల చూడాలంటే ఆమె సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా అలాగే ఉండాలి. పెళ్లిసందడి నుంచి ఇప్పుడు చేయబోతున్న 7 సినిమాల వరకు శ్రీలీలది ఒకటే స్టైల్, పెర్ఫామెన్స్ ఉంది. ఇలాగైతే జనాలకి త్వరగానే బోర్ కొట్టేస్తారని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.