Adipurush: ఇది AI తీసిన సినిమా..!
Hyderabad: ఇది కదా రామాయణం అంటే.. ఇలా కదా అందులోని క్యారెక్టర్లు ఉండాల్సింది.. అనిపించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆదిపురుష్ (adipurush) క్యారెక్టర్లను క్రియేట్ చేసింది. ఈ AI ఇమేజెస్ చూసి డైరెక్టర్ ఓం రౌత్‌ని (om raut) ట్యాగ్ చేస్తూ.. చూసి నేర్చుకో అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎటూ VFXకి ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని ఓం రౌత్ చెప్తున్నారు. అంత చేసినా సినిమాను మాత్రం నలుగురూ నవ్వుకునేలా తీసారు. అదేంటి అని అడిగితే చిన్న పిల్లల్లాగా సాకులు చెప్తున్నారు. ఇప్పుడున్న AIని వాడుకుని ఉంటే కచ్చితంగా ఆదిపురుష్ పైన చూపించినట్లుగానే ఉండేది. పాత కాలం నాటి రామాయణం (ramayanam) సినిమాల తర్వాత మోడ్రన్ జనరేషన్ చూపించాల్సిన రామాయణం అంటే ఇదే అనేలా ఏఐ ఆదిపురుష్ క్యారెక్టర్లను క్రియేట్ చేసింది.
మరోసారి ఎవరైనా రామాయణం తీయాలని చూస్తే ఊరుకునేది లేదు అని తిట్టించుకునే రేంజ్‌లో ఓం రౌత్ ప్రభాస్ (prabhas) పరువు తీసేసారు. ప్రభాస్‌పై కుట్రలో భాగంగానే ఆదిపురుష్ సినిమాను ట్రోల్ అయ్యేలా చేసారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తోంది. ట్రోల్స్ చేస్తున్నారని అసలు ఆదిపురుష్ రామాయణం కాదు అంటున్నారు. మరి రామాయణం కానప్పుడు జైశ్రీరామ్ పాట ఎందుకు పెట్టినట్లు? ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఒక సీటు ఎందుకు పెట్టినట్లు? ఆ సీట్లను రామాలయాల్లో ఎందుకు పంపిణీ చేస్తున్నట్లు? ఇంత జరిగాక ఇంకెవరైనా పురాణాలు తీయాలన్న ధైర్యం చేస్తారా? అటు దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి మహాభారతం తీయాలనుకుంటున్నారు. ఆయన వీఎఫ్ఎక్స్ మీద ఎంత దృష్టి పెట్టినప్పటకీ.. అంతా సహజంగానే కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఆదిపురుష్‌ని కూడా రాజమౌళి తీసి ఉంటే ఓ రేంజ్‌లో ఉండేది అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సర్లే.. అయిపోయిన దాని గురించి ఇంకా మాట్లాడుకుని ఏం లాభం..!