Ram Charan: ఆ ఫొటోలు ఫేక్‌.. త్వ‌ర‌లో బేబీ పిక్స్!

Hyderabad: రామ్ చ‌ర‌ణ్‌ (ram charan), ఉపాస‌న (upasana) దంప‌తులు పండంటి ఆడపిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో మెగా కుటుంబంలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. మ‌న‌వ‌రాలి రాక‌తో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే.. రామ్ చ‌ర‌ణ్ (ram charan) ఒక బేబీతో ఆడుకుంటున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దాంతో అంద‌రూ త‌నే మెగా ప్రిన్సెస్ (mega princess) అంటూ ఫొటోను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా.. అప్పుడే పుట్టిన చిన్నారి ఫొటోను కూడా చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల కూతురు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్ చేస్తున్నారు. ఇవ‌న్నీ వారు కేవ‌లం లైక్స్ కోసం చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. కొంద‌రు తెలీక ఆ ఫొటోను పెట్టి న్యూస్ రాసేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి ఒక అప్డేట్ వ‌చ్చింది. ఆ ఫొటోల‌న్నీ ఫేక్ అని.. త్వ‌ర‌లో బేబీ పిక్స్‌ని స్వ‌యంగా రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌లే (upasana) ఫ్యాన్స్‌కి షేర్ చేస్తార‌ని అంటున్నారు.