Pooja Hegde: రెమ్యునరేషన్ ఇంతలా పడిపోయిందా?
Hyderabad: ఒక సినిమా హిట్ అవ్వగానే హీరోయిన్‌కి డిమాండ్ ఓ రేంజ్లో పెరిగిపోతుంది. అదే ఫ్లాప్ అయితే మాత్రం ఇంకా దారుణంగా పడిపోతుంది. ఇప్పుడు బుట్ట బొమ్మ పూజా హెగ్డే (pooja hegde) పరిస్థితి కూడా ఇదే. అలవైకుంఠపురం సినిమా వరకు పెద్దగా హిట్స్ లేకపోయినా వరుస ఛాన్స్‌లతో జోరు మీద ఉన్న పూజ.. అలవైకుంఠపురంతో సక్సెస్‌తో ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రతి సినిమాలో పూజనే (pooja hegde) తీసుకోవాలని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. కాల్ షీట్లు కుదరని పక్షంలోనే వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లేవారు. తనకున్న డిమాండ్‌తో రెమ్యునరేషన్‌ను రూ.4 కోట్లకు పెంచేసింది పూజ.
ఇప్పుడు సీన్ మారిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజకు ఒక్క హిట్ లేదు. రాధే శ్యాం, బీస్ట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక అటు హిందీలో కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా ఫ్లాప్ అయిపోయింది. పైగా సినిమాపై వచ్చిన ట్రోల్స్ పూజ (pooja hegde) కెరీర్‌పై కూడా పడ్డాయి. ఇక సరే అని త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజకు ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వస్తుంది అని అనుకున్నారు చాలా మంది. ఏమైందో ఏమో కానీ సినిమా సగం షూటింగ్ అయ్యాక పూజను తీసేసి వేరే హీరోయిన్ని పెట్టాలనుకుంటున్నట్లు టీం అనౌన్స్ చేసింది. ఇందుకు కారణం పూజ (pooja hegde) హిందీ సినిమాలకు ఓకే చేయడమేనని అంటున్నారు. ఎన్ని సినిమాలు ఓకే చేసినా హిట్ లేక చాలా కాలం అయింది కాబట్టి.. పూజ రెమ్యునరేషన్ రూ.4 కోట్ల నుంచి రూ.70 లక్షలకు పడిపోయిందని టాలీవుడ్ టాక్.