Sobhita Dhulipala: అలాంటి అబ్బాయి దొరికితే ఓకే..!
Hyderabad: అక్కినేని నాగచైతన్య (naga chaitanya) శోభిత ధూలిపాళ్ల (sobhita dhulipala) ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంతతో (samantha) నాగచైతన్య విడాకులు అవ్వడానికి కారణం శోభితనే అని కూడా రూమర్స్ వచ్చాయి. అప్పటివరకు వీటిని రూమర్స్‌గానే అనుకున్నప్పటికీ.. ఎప్పుడైతే శోభిత (sobhita dhulipala), నాగచైతన్య కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్ వెళ్లిన ఫొటో బయటికి వచ్చిందో అప్పటినుంచి ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ఈ విషయం గురించి నాగచైతన్యను అడిగితే.. అనవసరంగా తన విడాకుల విషయంలో మూడో వ్యక్తిని లాగొద్దు అన్నాడు. శోభితను అడిగితే.. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనింది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో వివరించింది శోభిత.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు, జీవితం చాలా చిన్నది అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకునేవాడితో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అయితే తన పర్సనల్ విషయాలపై పబ్లిక్‌కి కూడా ఇంట్రెస్ట్ లేదని, తను ఏదైనా చెప్తేనే అది పబ్లిక్ నమ్ముతారని అంటోంది. ఎన్నో ఆడిషన్లు ఇచ్చి, ఆఫీసుల చుట్టూ తిరిగితే తనకు అవకాశాలు వచ్చాయని, తన కష్టం, కెరీర్ గురించి మాట్లాడకుండా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు ప్రస్తావిస్తారని మండిపడింది.