Roja: చరణ్..అప్పటి రోజులు గుర్తొస్తున్నాయ్!
Hyderabad: రామ్ చరణ్ (ram charan) ఉపాసన (upasana) దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించిన సందర్భంగా YCP ఎంపీ రోజా (roja) శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పుడు షూటింగ్ సమయాల్లో చరణ్ సెట్స్‌కి వచ్చినప్పుడు ఎత్తుకునేదాన్నని, ఇప్పుడు చరణే తన కూతుర్ని ఎత్తుకుంటున్నాడంటూ అప్పటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి ఎవర్‌గ్రీన్ నటుడని, ఇప్పుడు తాతయ్య అనే మరో టైటిల్‌ను కూడా అందుకున్నారని అన్నారు. చిట్టి మహాలక్ష్మి ఇంటికి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు రోజా. ఏదో సాధారణంగా ట్వీట్ చేస్తారని అనుకుంటే ఇలా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంటూ భారీ ట్వీట్ చేయడంతో రోజాకు సడెన్‌గా ఏమైందబ్బా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.