Sakshi Vaidya: ఓ ప‌క్క అబ్బాయ్‌తో.. మ‌రోప‌క్క బాబాయ్‌తో..!

Hyderabad: ఏజెంట్ (agent) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య‌ (sakshi vaidya). ఆ సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ.. ఈ బ్యూటీకి ఛాన్స్‌లు వ‌రుస క‌డుతున్నాయి. త‌న రెండో సినిమా వ‌రుణ్ తేజ్ (varun tej) న‌టిస్తున్న గాంధీవ‌దారి అర్జున‌ (gandeevadhari arjuna). ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల కంప్లీట్ అయింది. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (ustaad bhagat singh) సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ప‌క్క‌న మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల (sreeleela) న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాక్షి వైద్య సెకండ్ లీడ్‌గా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.