Nani: సినిమా లేట్‌గా చూసినందుకు ఫీల‌వుతున్నా

Hyderabad: ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వేణు (venu) డైరెక్ట్ చేసిన బ‌ల‌గం (balagam) సినిమాను నేచుర‌ల్ స్టార్ నాని (nani) చూసార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్వీట్ చేసారు. ఇంత మంచి సినిమాను ఇంత లేట్‌గా చూసినందుకు ఫీల‌వుతున్న‌ట్లు తెలిపారు. చాలా కాలంగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ కోరుకుంటున్నది ఇలాంటి సినిమానే క‌దా అని మొత్తం టీంను మెచ్చుకున్నారు. సినిమాలో న‌టించిన ప్రతి ఒక్క‌రు ప్రాణం పెట్టి న‌టించార‌ని ప్ర‌శంసించారు నాని.