Agent: మ‌మ్మ‌ల్ని దేవుడే కాపాడాడు..!

Hyderabad: అఖిల్ అక్కినేని (akhil akkineni) న‌టించిన ఏజెంట్ (agent) సినిమా ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయిందో అంద‌రికీ తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి (surender reddy) డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అనిల్ సుంక‌ర (anil sunkara) ప్రొడ్యూస్ చేసారు. సినిమా రిలీజ్ అయిన రోజే ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. దాంతో త‌ప్పు త‌మ‌దేన‌ని, మ‌ళ్లీ ఇలాంటి చెత్త సినిమాలు తీయ‌కుండా జాగ్ర‌త్తప‌డ‌తామ‌ని ప్రొడ్యూస‌ర్ త‌ప్పు ఒప్పుకుని ఫ్యాన్స్‌కి సారీ చెప్పారు. అయితే ఈ సినిమా రైట్స్ తాను కొనుక్కోవాల‌నుకున్నాన‌ని, ఇదే విష‌యాన్ని అనిల్ సుంక‌ర‌తో చెప్తే కోట్లు అడిగాడ‌ని ఏషియ‌న్ (asian) ఫిలింస్ అధినేత‌, ప్రొడ్యూస‌ర్ సునీల్ న‌రంగ్ (suniel narang) తెలిపారు. త‌న‌తో పాటు ఇంకో ఆరుగురు వ్య‌క్తులు కూడా క‌లిసి రైట్స్ కొనుక్కోవాల‌నుకున్నామ‌ని తెలిపారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆ దేవుడే మ‌మ్మ‌ల్ని కాపాడాడు అనుకున్నామ‌ని తెలిపారు.