‘పఠాన్​’​పై ‘బాహుబలి’ ప్రొడ్యూసర్​ కామెంట్స్​!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా 2017లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రెబల్​స్టార్​ ప్రభాస్, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బాహుబలి2’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1900 కోట్ల కలెక్షన్ సాధించింది. హిందీలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొలపింది. ‘బాహుబలి2’ విడుదలై 7 సంవత్సరాలు అయినా ఆ మూవీ రికార్డులను ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. కానీ, తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘బాహుమలి 2’ హిందీ రికార్డును బద్దలు కొట్టి జక్కన్న సినిమాను మించి వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ పఠాన్​ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘బాహుబలి 2’ రికార్డులను బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ బద్ధలు కొట్టడం మరింత సంతోషంగా ఉందంటూ శోభు చేసిన ట్వీట్​ వైరల్​ అయ్యింది.

సృష్టించేది అందుకే..
‘బాహుబలి 2’ రికార్డులను ‘పఠాన్’ బీట్ చేయడం పట్ల నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. హిందీలో తమ సినిమా రికార్డులను బీట్ చేయడంపై ట్విటర్​ వేదికగా ‘పఠాన్’ టీమ్ ను అభినందించారు. “మా ‘బాహుబలి 2’ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్ రికార్డులని షారుక్ ‘పఠాన్’ సినిమా బద్దలు కొట్టడం సంతోషంగా ఉంది. ‘పఠాన్’ టీమ్ కి ప్రత్యేకంగా అభినందనలు. రికార్డులు సృష్టించేది బద్దలు కొట్టడానికే. అందులోనూ షారుఖ్​ సినిమా ఈ ఘనత సాధించడం మరింత ఆనందంగా ఉంది” అని శోభు రాసుకొచ్చారు. ఆయన ట్వీట్ పై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శోభులోని పాజిటివిటీకి ఈ ట్వీట్ నిదర్శనం అంటూ అభినందిస్తున్నారు.

‘పఠాన్’ కలెక్షన్..
‘బాహుబలి 2’ హిందీలో భారీ విజయం సాధించడమే కాదు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్రలో నిలిచింది. ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ రూ. 510 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ‘పఠాన్’ సినిమా బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ‘పఠాన్’ సినిమా రూ. 530 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ సినిమాకు ఇంకా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మాత్రమే కాదు, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్ – ఇలా ‘బాహుబలి ‘ క్రియేట్ చేసిన చాలా రికార్డులను ‘పఠాన్’ కొల్లగొట్టింది.

ఏడేళ్ల తర్వాత రికార్డు బ్రేక్​..
దక్షిణాది సినిమా అయిన ‘బాహుబలి 2’ క్రియేట్ చేసిన రికార్డులు బ్రేక్​ చెయ్యడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇక కలెక్షన్ల పరంగా పఠాన్​, బాహుబలి ఒకటి, రెండు స్థానాల్లో ఉంటే, కన్నడ సెన్సేషన్ యశ్ హీరోగా నటించిన ‘కె.జి.యఫ్ : చాఫ్టర్ 2’ మూడో స్థానంలో ఉంది. ఆ సినిమా రూ. 434 కోట్లు కలెక్ట్ చేసింది. అమీర్ ఖాన్ ‘దంగల్’ (రూ. 387.38 కోట్లు)తో 4వ స్థానంలో, రణబీర్​ కపూర్ ‘సంజు’ (రూ. 342 కోట్లు)తో 5 స్థానంలో ఉన్నాయి.