Satyabhama: హీరోయిన్‌కి ఎలివేష‌న్ ఇస్తే ఈ రేంజ్‌లో ఉంటదా..!

Hyderabad: టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ (kajal agarwal) ఈసారి మాస్ యాక్ష‌న్ సినిమాతో రాబోతున్నారు. కాజ‌ల్ 60గా రాబోతున్న ఈ సినిమాకు స‌త్య‌భామ (satyabhama) అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కాజ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్ తెగ ట్రెండ్ అవుతోంది. ఇందుకు కార‌ణం.. కాజ‌ల్ ఇలాంటి క్యారెక్ట‌ర్‌లో ఎప్పుడూ న‌టించ‌లేదు. పోలీస్ అధికారి క్యారెక్ట‌ర్‌లో.. చీర క‌ట్టుకుని.. క్రిమిన‌ల్స్‌ను చేత్తో కొట్టి నిజం చెప్పించడాన్ని టీజ‌ర్‌లో చూపించిన తీరు అదిరిపోయింది. కాజ‌ల్ గాజులు ప‌గిలిపోయిన‌ప్పుడు.. గాజులు లేకుండా కొట్టాల్సింది మేడ‌మ్.. అని కానిస్టేబుల్ అంటుంటే.. ఇందుకు కాజ‌ల్ గాజులు లేకుండానే కొట్టాడు క‌దా అని మ‌గ పోలీసుని ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కాజ‌ల్ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్ అవుతుంద‌ని అంటున్నారు. అఖిల్ డేగ‌ల ఈ సినిమాను డైరెక్ట్ చేసారు.