Adipurush అసలు రామాయణం కాదు..!
Hyderabad: ఆదిపురుష్ (adipurush) సినిమా అసలు రామాయణమే కాదని షాకింగ్ కామెంట్స్ చేసారు ఈ సినిమా రైటర్ మనోజ్ ముంతాషిర్ (manoj muntashir). రామాయణం నుంచి కొన్ని ఎపిసోడ్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించాం అని తెలిపారు. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఆదిపురుష్ అని పెట్టామని అన్నారు. ఈ విషయాన్ని మనోజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడే ముందు రెండు విషయాలు క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నా. మేం తీసింది రామాయణం కాదు. రామాయణంలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని తీసిన సినిమా ఇది. మార్కెటింగ్ కోసం రామాయణ అని కూడా టైటిల్ పెట్టుండేవాళ్లం. కానీ ముందు నుంచి మేం క్లారిటీతో ఉన్నాం కాబట్టే ఆదిపురుష్ అని పెట్టాం. ముఖ్యంగా హనుమంతుడి పాత్ర కోసం రాసిన డైలాగులు చాలా ఆలోచించి రాసినవి. సింపుల్‌గా ఉండేలా చూసుకున్నాం. సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు క్లిష్టమమైన భాష మాట్లాడితే ఆడియన్స్‌కు అర్థంకాదు” అని తెలిపారు.